TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

స్టిర్లింగ్ యంత్రం

The Typologically Different Question Answering Dataset

స్కాట్లాండ్ పరిశోధకుడు రాబర్ట్ స్టిర్లింగ్ 1816లో ఒక సంవృత చక్ర వాయు యంత్రం యొక్క మొట్టమొదటి ఆచరణాత్మక ఉదాహరణను కనిపెట్టారు, ఫ్లెమింగ్ జెంకిన్ 1884లోనే ఇటువంటి యంత్రాలన్నింటినీ సాధారణంగా స్టిర్లింగ్ ఇంజిన్‌లుగా సూచించారు. ఈ పేరు ప్రతిపాదనకు తక్కువ ఆదరణ లభించింది, మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వివిధ రకాల యంత్రాలను వాటి రూపకర్తలు లేదా తయారీదారుల పేరుతోనే పిలవబడటం కొనసాగింది, రైడర్, రాబిన్సన్ లేదా హెన్రిసి యొక్క (ఉష్ణ) వాయు యంత్రాలు దీనికి ఉదాహరణలు. 1940వ దశకంలో, ఫిలిప్స్ కంపెనీ తమ సొంత "వాయు యంత్రం" కోసం అనువైన పేరు కోసం అన్వేషణ ప్రారంభించింది, ఈ కంపెనీ ఆ సమయానికే తమ యంత్రాన్ని ఇతర వాయువులతో పరీక్షించి చూసింది, చివరకు ఏప్రిల్ 1945న దీనికి "స్టిర్లింగ్ ఇంజిన్" అనే పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుంది.[7] అయితే, సుమారుగా ముప్పై సంవత్సరాల తరువాత కూడా గ్రాహం వాకర్ "ఉష్ణ వాయు యంత్రం" వంటి పదాలను "స్టిర్లింగ్ ఇంజిన్‌"కు మారుపేరుగా ఉపయోగించడం కొనసాగడంపై అసంతృప్తితో ఉన్నారు, ఇదిలా ఉంటే స్టిర్లింగ్ ఇంజిన్ పేరు కూడా వాటికి విస్తృతంగా ఉపయోగించబడుతుండేది. ఈ పరిస్థితి ఇప్పుడు కొంతవరకు మెరుగుపడింది, కనీసం విద్యావిషయక పాఠ్యాంశాల్లో ఇప్పుడు వీటిని వేర్వేరుగా సూచిస్తున్నారు, ఇప్పుడు సాధారణంగా స్టిర్లింగ్ ఇంజిన్ అనే పదాన్ని ప్రత్యేకంగా ఒక శాశ్వత వాయు కార్యకారి ద్రవంతో ఉన్న సంవృత-చక్ర పునరుత్పాదక ఉష్ణ యంత్రాన్ని సూచించేందుకు ఉపయోగిస్తున్నారు, దీనిలో సంవృత చక్రాన్ని ఒక ఉష్ణగతిక వ్యవస్థగా నిర్వచించవచ్చు, ఇందులోని వ్యవస్థలో కార్యకారి ద్రవం శాశ్వతంగా నిలిచివుంటుంది, పునరుత్పాదకత అనేది ఒక నిర్దిష్ట రకపు అంతర్గత ఉష్ణ వినిమాయకం మరియు రీజెనరేటర్ (పునరుత్పాదకం)గా తెలిసిన థర్మల్ స్టోర్ ఉపయోగాన్ని వర్ణిస్తుంది. వాయుసంబంధ ద్రవానికి బదులుగా ఒక ద్రవాన్ని ఉపయోగిస్తూ ఇదే సిద్ధాంతంపై పని చేసే యంత్రాన్ని 1931లో కనిపెట్టారు, దీనిని మాలోన్ ఉష్ణ యంత్రంగా పిలిచేవారు.[8]

స్టిర్లింగ్ ఇంజిన్ ను ఎవరు కనుగొన్నారు?

  • Ground Truth Answers: రాబర్ట్ స్టిర్లింగ్రాబర్ట్ స్టిర్లింగ్రాబర్ట్ స్టిర్లింగ్

  • Prediction: